farmers situation in the society telugu article.

రోజులు మారుతున్నాయి …. ఈ మార్పు ముందుకా?? వెనకకా??

అవసరానికి అన్ని వాడాలి అవసరం తీరాక కొన్ని వదిలేయకూడదు అలా చేస్తే మన అస్తిత్వానికే అసలు ఎసరు వస్తుంది.

ఏదో సినిమా లో చెప్పినట్టు వస్తువులను వాడటానికి – మనుషులు ప్రేమించడానికి అని అలా చెప్పినట్టు చేస్తే పర్వాలేదు లేకపోతేనే బ్రతుకులు బందరు బస్టాండ్ అయిపోతాయి.

ఉరిలో ఉన్నంతలో గుట్టుచప్పుడు కాకుండా బ్రతికి ఉదయం లేచి పొలం పనులు చూసుకుని సాయంకాలం ఐనవాళ్ళతో అత్మియులతో చక్కగా కబుర్లు చెప్పుకునే రోజులు మారిపోయి.

చెన్నై బజార్లో పనికోసం ఆత్రుతగా చూసి దొరికితే తిని లేకుంటే పస్తులుండే రోజులు ఎందుకు వచ్చాయి .

అసలు సమస్య ఎక్కడుంది ఆదుకోవలసిన ప్రబుత్వం లోనా ?? అవకాశాన్ని రైతువరకు చేరనివ్వని దలరుల్లోనా ?? తన అస్తిత్వాన్ని  అడ్డుతగిలే వాళ్ళని తుంగలో తొక్కకుండా ప్రోత్సహించే రైతుల్లోనా ???

ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు , ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు

ఒక రాజకీయ నాయకుడి కొడుకు ఆయనలాగే అవుతున్నాడు ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు కాని ఒక రైతు వారసులు మాత్రం ఎందుకు రైతులు కాలేకపోతున్నారు . అవకాశాలు అందిపుచునున్న వాళ్ళు పైపైకి వెళ్తున్నారు అవకాసం లేనివాళ్ళు తప్పదని రైతులుగా ఉంటున్నారు .

డాక్టర్ లు గా ఇంజనీర్ లు గా మారడం మంచిదే గాని వాటితో పాటుగా వ్యవసాయం అనేది ఒక వృత్తే అని గుర్తించలి.

పైన చెప్పిన వాళ్ళు ఉన్న లేకున్నా పర్వాలేదు కానీ రైతు అన్నవాడే లేకపోతె మన మనుగడే ప్రస్నార్దాకం ??

రైతులను పెరగాలంటే ఏంచెయ్యాలి ??

వాళ్ళను ప్రోత్సహించాలి ఒకప్పుడు కంప్యూటర్ తో ఉద్యోగం అంటే నవ్వినవాళ్లు ఇప్పుడు ఆ ఉద్యోగం కోసం తమపిల్లలని చదివిస్తున్నారు అలాగే ఇప్పుడు రైతు అంటే నవ్వినవాల్లె రేపు తమపిల్లలు కూడా రైతే అవ్వాలని కోరుకునే విధం గా వాళ్ళని ప్రోత్సహించాలి.

వాళ్ళకు కావాల్సింది ఫ్రీ గా వచ్చే ప్యాకెట్ లు తక్కువలో వచ్చే విత్తనాలు , సుబ్సిడిలు ,సాదారణ రాయతీలు తొక్క తోటకూర కాదు వాళ్ళు పండించుకునే పంటకి గిట్టుబాటు ధర వాళ్ళు కొత్తగా వేసిన పంటకి మంచి మార్కెట్ , మంచి నాణ్యమైన కరెంటు ఇవి ఇచ్చిచుడండి మీరు  రాయతీలు ఇవ్వడం కాదు మీకు రాయతీలు ఇచ్చే రోజులు వస్తాయి.

ఈ పద్దతులు ఇలాగే ఉంటె రానున్న రోజుల్లో పూర్వం ఆహారం కోసం మనిషిని మనిషే చంపుకున్నట్టు మనం కూడా చంపుకునే రోజులు వస్తాయి “.

మార్పు మంచిదే కాని ఆ మార్పు మనకి అవకాశాలు కల్పించాలి గాని అధోగతి పాలు చెయ్యకూడదు.

దయచేసి మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చెయ్యగలరని మనవి .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s